గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతిలేదు

దిశ, హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని అందరూ సహకరించి, ప్రజలందరూ ఎవరి ఇంట్లో వారే పండుగను జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధించినట్టు తెలిపారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం […]

Update: 2020-08-17 08:24 GMT

దిశ, హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిని అందరూ సహకరించి, ప్రజలందరూ ఎవరి ఇంట్లో వారే పండుగను జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధించినట్టు తెలిపారు.

మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు. పోలీసుల సూచనలు పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పోలీసుల ఉత్తర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ‌ హెచ్చరించారు.

Tags:    

Similar News