ఓటర్ ఐడీకి ఆధార్ లింక్

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు ఆధార్ అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరి అయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. సిమ్ తీసుకోవాలన్నా.. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. లేదా ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. ఆధార్ అనేది తప్పనిసరి అయింది. ఆధార్ లేకపోతే ఏ పని జరగదన్నంతగా దాని ఉపయోగం పెరిగిపోయింది. దేనికి దరఖాస్తు చేసుకున్నా సరే.. ఆధార్ తప్పనిసరిగా కావాలనే నిబంధన పెట్టారు. అయితే ఇప్పటికే ఆధార్‌తో మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు లాంటివి తప్పనిసరిగా లింక్ […]

Update: 2021-03-17 04:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు ఆధార్ అనేది ప్రతిఒక్కరికీ తప్పనిసరి అయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. సిమ్ తీసుకోవాలన్నా.. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. లేదా ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. ఆధార్ అనేది తప్పనిసరి అయింది. ఆధార్ లేకపోతే ఏ పని జరగదన్నంతగా దాని ఉపయోగం పెరిగిపోయింది. దేనికి దరఖాస్తు చేసుకున్నా సరే.. ఆధార్ తప్పనిసరిగా కావాలనే నిబంధన పెట్టారు.

అయితే ఇప్పటికే ఆధార్‌తో మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు లాంటివి తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టగా.. తాజాగా మరో గుర్తింపు కార్డుకు కేంద్రం ఆధార్ లింక్ పెట్టింది.

ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ చేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. దీని వల్ల నకిలీ ఓట్లను తొలగించవచ్చని, ఒక్కరు ఒక ఓటు మాత్రమే వేసేలా చేయవచ్చని తెలిపారు. కొంతమంది రెండు, మూడుచోట్ల ఓటర్ కార్డును కలిగి ఉంటున్నారని, ఆధార్‌తో లింక్ చేయడం వల్ల వాటిని అరికట్టవచ్చని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News