గజ్వేల్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్

దిశ, గజ్వేల్: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మాణాలను చేశారు. మండల కేంద్రంలోని మర్కుక్, పాములపర్తి, ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి స్వచ్ఛందంగా 15 రోజులు లాక్‌డౌన్ అమలు చేసుకుంటున్నట్లు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ప్రకటించారు. ఇప్పటికే భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు […]

Update: 2021-05-06 06:55 GMT

దిశ, గజ్వేల్: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలో తీర్మాణాలను చేశారు. మండల కేంద్రంలోని మర్కుక్, పాములపర్తి, ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి స్వచ్ఛందంగా 15 రోజులు లాక్‌డౌన్ అమలు చేసుకుంటున్నట్లు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ప్రకటించారు. ఇప్పటికే భారీగా కరోనా కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కిరాణా షాపులు, హోటలు, చికెన్, మటన్, అదేవిధంగా వర్తక దుకాణాలు, వారం సంతలు నిర్వహించకూడదని తీర్మాణించుకున్నారు. రూల్స్ పాటించని వారికి గ్రామపంచాయతీ రూ.1000/- జరిమానా విధిస్తుందన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News