ఆ జిల్లాలోని రెండు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజపల్లి, గొల్లపల్లి అనే రెండు గ్రామాల్లో గ్రామస్తులు స్వచ్ఛందగా లాక్‌డౌన్ విధించుకున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామ పాలకవర్గం, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు కరోనా పాజిటివ్ వచ్చిన మల్లాపూర్ మండలంలోని గ్రామాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కేసులు తీవ్రతరం అవుతుండటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం మండల కేంద్రంలో లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు […]

Update: 2021-04-07 12:00 GMT

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజపల్లి, గొల్లపల్లి అనే రెండు గ్రామాల్లో గ్రామస్తులు స్వచ్ఛందగా లాక్‌డౌన్ విధించుకున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామ పాలకవర్గం, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు కరోనా పాజిటివ్ వచ్చిన మల్లాపూర్ మండలంలోని గ్రామాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

కేసులు తీవ్రతరం అవుతుండటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం మండల కేంద్రంలో లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం దుకాణాలు తెరిచి ఉంటాయని మిగతా సమయంలో పూర్తిగా లాక్డౌన్ వర్తిస్తుందన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.1,000 జరిమానా విధించాలని పాలక వర్గం నిర్ణయించింది. దీన్ని వెంటనే అమల్లోకి తేవడంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ప్రజలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Tags:    

Similar News