‘కరోనాను తరిమి కొట్టాలి’

దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారిని ప్రజలు తరిమి కొట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని తెలిపారు. మన కోసమే కాకుండా, కుటుంబం, సమాజం కోసం ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. వలస కార్మికులకు బియ్యం, రూ.500 చొప్పున నగదును ప్రభుత్వమే […]

Update: 2020-04-07 04:04 GMT

దిశ, నిజామాబాద్: కరోనా మహమ్మారిని ప్రజలు తరిమి కొట్టాలని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారని తెలిపారు. మన కోసమే కాకుండా, కుటుంబం, సమాజం కోసం ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. వలస కార్మికులకు బియ్యం, రూ.500 చొప్పున నగదును ప్రభుత్వమే అందజేస్తోందని చెప్పారు. ఆర్థికంగా ఉన్న వారు తమకు వచ్చే రేషన్ బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 52 శెనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలను రైతులు వినియోగించుకుని గిట్టుబాటు ధర పొందాలని వెల్లడించారు. 15 రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే, జిల్లా తెరాస నాయకులు, కార్యకర్తలు కలిసి రూ.5లక్షల నగదు అందజేసినట్టు తెలిపారు. బాన్సువాడలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలు అధైర్య పడొద్దనీ, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మునిసిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tags: vemula prashanth reddy, kamareddy, collectorate, corona, virus, collector sharath, trs

Tags:    

Similar News