కల్నల్ సంతోష్ బాబుకు పరమవీర చక్ర !

ఢిల్లీ: ఈ ఏడాది పరమవీర చక్ర అవార్డును కల్నల్ సంతోష్ బాబుకు ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. యుద్దంలో పరాక్రమం చూపి అసువులు బాసిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఈ ఏడాది గాల్వన్ లోయలో చైనా దురాక్రమణను తిప్పే కొట్టే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఆయన చూపిన పరాక్రమానికి గుర్తుగా ఆయనకు అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర ఇవ్వాలని ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. […]

Update: 2021-01-13 05:47 GMT

ఢిల్లీ: ఈ ఏడాది పరమవీర చక్ర అవార్డును కల్నల్ సంతోష్ బాబుకు ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. యుద్దంలో పరాక్రమం చూపి అసువులు బాసిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఈ ఏడాది గాల్వన్ లోయలో చైనా దురాక్రమణను తిప్పే కొట్టే క్రమంలో కల్నల్ సంతోష్ బాబు పోరాడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఆయన చూపిన పరాక్రమానికి గుర్తుగా ఆయనకు అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర ఇవ్వాలని ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ అవార్డ్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది భారత్, చైనా బలగాల మధ్య గాల్వన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భారతీయ సైనికులు 20 మంది వీర మరణం పొందారు. వారిలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News