యూకే వేరియంట్ కరోనా కేసులు @150

న్యూఢిల్లీ: భారత్‌లో యూకే వేరియంట్ కరోనా కేసుల సంఖ్య శనివారానికి 150కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరందరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్టు తెలిపింది. క్లోజ్ కాంటాక్టులను ఇప్పటికే క్వారంటైన్‌లోకి పంపినట్టు పేర్కొంది. వారితోపాటు ప్రయాణించిన సహ ప్రయాణికులు, కుటుంబ సంబంధీకులు, ఇతరుల కోసం అన్వేషణ వేగంగా సాగుతున్నదని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. ఇప్పటికే యూకే వేరియంట్ కేసులు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, […]

Update: 2021-01-23 06:18 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో యూకే వేరియంట్ కరోనా కేసుల సంఖ్య శనివారానికి 150కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరందరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూమ్ ఐసొలేషన్‌లో ఉంచినట్టు తెలిపింది. క్లోజ్ కాంటాక్టులను ఇప్పటికే క్వారంటైన్‌లోకి పంపినట్టు పేర్కొంది. వారితోపాటు ప్రయాణించిన సహ ప్రయాణికులు, కుటుంబ సంబంధీకులు, ఇతరుల కోసం అన్వేషణ వేగంగా సాగుతున్నదని తెలిపింది.

పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరుగుతున్నాయని వివరించింది. ఇప్పటికే యూకే వేరియంట్ కేసులు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్‌ సహా పలుదేశాల్లో నమోదయ్యాయి.

Tags:    

Similar News