ఉదయం బయటికి వెళ్లిన బాలురు.. పోలీసులకు అలా కనిపించి..

దిశ,భువనగిరి :యాదాద్రి-భువనగిరిజిల్లాభువనగిరి మండల పరిధిలో గల బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భువనగిరి పట్టణం కిసాన్ నగర్ కు చెందిన లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14)లు రిజర్వాయర్ చూసి వస్తామని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటినుండి బయలుదేరి వెళ్లారు. రాత్రి అవుతున్న ఎంతసేపటికి పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు బస్వాపురం ప్రాజెక్టు వద్ద తప్పిపోయిన వారి చెప్పులు కనిపించడంతో డ్యామ్ వద్ద […]

Update: 2021-07-13 02:04 GMT

దిశ,భువనగిరి :యాదాద్రి-భువనగిరిజిల్లాభువనగిరి మండల పరిధిలో గల బస్వాపురం రిజర్వాయర్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భువనగిరి పట్టణం కిసాన్ నగర్ కు చెందిన లింగాల హేమంత్ (14), సింగిరెడ్డి పవన్ కుమార్ (14)లు రిజర్వాయర్ చూసి వస్తామని చెప్పి సోమవారం సాయంత్రం ఇంటినుండి బయలుదేరి వెళ్లారు. రాత్రి అవుతున్న ఎంతసేపటికి పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు బస్వాపురం ప్రాజెక్టు వద్ద తప్పిపోయిన వారి చెప్పులు కనిపించడంతో డ్యామ్ వద్ద గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన పవన్, హేమంత్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో భువనగిరిలోని కిసాన్ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Tags:    

Similar News