సిద్దిపేట జిల్లాలో పండుగ పూట విషాదం..

దిశ, జగదేవపూర్ : సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జగదేవపూర్ మండలం గోల్లపల్లి బైపాస్ వద్ద శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన నీల రామనర్సు మునిగడప నుంచి జగదేవపూర్ వైపు వెళ్లుతుండగా గొల్లపల్లి గ్రామానికి చెందిన వి. బాల్ నర్సయ్య జగదేవపూర్ నుంచి సొంత గ్రామం గొల్లపల్లి వైపు వెళ్తుండగా రెండు బైకులు పరస్పరం ఎదురెదురుగా […]

Update: 2021-10-15 08:57 GMT

దిశ, జగదేవపూర్ : సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జగదేవపూర్ మండలం గోల్లపల్లి బైపాస్ వద్ద శుక్రవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మందాపూర్ గ్రామానికి చెందిన నీల రామనర్సు మునిగడప నుంచి జగదేవపూర్ వైపు వెళ్లుతుండగా గొల్లపల్లి గ్రామానికి చెందిన వి. బాల్ నర్సయ్య జగదేవపూర్ నుంచి సొంత గ్రామం గొల్లపల్లి వైపు వెళ్తుండగా రెండు బైకులు పరస్పరం ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

దీంతో మందాపూర్ గ్రామానికి చెందిన నీల రామనర్సుకు తీవ్ర గాయాలవ్వగా పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం రామనర్సు యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.

Tags:    

Similar News