ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తుండగా.. తాజాగా ఆరో రౌండ్ పూర్తయింది. ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 17,406 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,335 ఓట్లు వచ్చాయి. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 7,846 ఓట్లు, కాంగ్రెస్‌కు 5,187 ఓట్లు వచ్చాయి. మొత్తం ఆరు రౌండ్లు కలిపి వాణీదేవికి 1,05,710 ఓట్లు, రామచంద్రరావుకు 98,084 ఓట్లు, […]

Update: 2021-03-18 21:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తుండగా.. తాజాగా ఆరో రౌండ్ పూర్తయింది. ఆరో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది. ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి 17,406 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,335 ఓట్లు వచ్చాయి.

ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 7,846 ఓట్లు, కాంగ్రెస్‌కు 5,187 ఓట్లు వచ్చాయి. మొత్తం ఆరు రౌండ్లు కలిపి వాణీదేవికి 1,05,710 ఓట్లు, రామచంద్రరావుకు 98,084 ఓట్లు, నాగేశ్వర్‌కు 50,450 ఓట్లు వచ్చాయి.

అటు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29, 627 ఓట్లు వచ్చాయి. 19,914 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభివాణీదేవి 7,626 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే సమీప బీజేపీ అభ్యర్థిపై స్వల్ప ఆధిక్యంలోనే వాణీదేవి ఉండటంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. శనివారం రాత్రికి తుది ఫలితాలు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News