Viral : పెళ్లి అయిన గంటకే తల్లి అయింది.. షాక్‌లో పెళ్లి కొడుకు ఏం చేశాడంటే..

పెళ్లి అంటే రెండు జీవితాలు ముడిపడిపోయే క్షణం. కాగా ఈ సమయాన్ని అద్భుతంగా మలుచుకోవాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ఫ్లోరిడాకు చెందిన బ్రియాన్ కూడా ఇలాగే అనుకుంది. అప్పటికే

Update: 2024-05-10 02:29 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లి అంటే రెండు జీవితాలు ముడిపడిపోయే క్షణం. కాగా ఈ సమయాన్ని అద్భుతంగా మలుచుకోవాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ఫ్లోరిడాకు చెందిన బ్రియాన్ కూడా ఇలాగే అనుకుంది. అప్పటికే ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆ అమ్మాయి.. తనకు కాబోయే వాడితో ఆ రోజు ఎలా ఉండాలో కలలు కంటుంది. కానీ ఉన్నట్టుండి తనకు శ్వాస కోశ ఇన్ఫెక్షన్ రావడంతో హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చింది. లేట్ చేస్తే బిడ్డకు కూడా ప్రమాదమని, త్వరగా డెలివరీ చేయాలని డిసైడ్ చేశారు వైద్యులు.

లేబర్ రూమ్ కు వెళ్ళాక మీ ఆయన పేరు ఏంటి అని అడగ్గా.. ఇంకా పెళ్లి కాలేదని, నిజానికి ఈరోజే మ్యారేజ్ డేట్ పెట్టుకున్నామని, కానీ చివరకు ఇక్కడ ఉన్నామని చెప్పింది బ్రియాన్. దీంతో అక్కడి నర్సులు హడావిడిగా వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఆమె బ్యాగ్ లో మ్యారేజ్ రింగ్స్ ఉండటంతో పెళ్లి తంతు కానిచ్చేశారు. అయితే ఆ తర్వాత గంట లోపే మగ బిడ్డకు జన్మనిచ్చింది బ్రియాన్. దీంతో అందరూ హ్యాపీగా ఉండగా.. డబుల్ హ్యాపీనెస్ తో ఉన్న భర్త అందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ అకేషన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News