Viral: కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టిన యువతి.. ఆ స్పర్శకు పాము రియాక్షన్ (Video)

సాధారణంగా పామును చూస్తేనే భయంతో బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది. క్షణం ఆలోచించకుండా బ్రెయిన్ వెంటనే పరుగెత్తమని సిగ్నల్ ఇచ్చేస్తుంది. కాటు వేస్తే కాటికి పోతావని హెచ్చరిస్తుంది. కానీ కొందరు మాత్రం

Update: 2024-05-16 04:27 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా పామును చూస్తేనే భయంతో బాడీలో షివరింగ్ వచ్చేస్తుంది. క్షణం ఆలోచించకుండా బ్రెయిన్ వెంటనే పరుగెత్తమని సిగ్నల్ ఇచ్చేస్తుంది. కాటు వేస్తే కాటికి పోతావని హెచ్చరిస్తుంది. కానీ కొందరు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వాటిని ప్రేమగా దగ్గరకి తీసుకుంటారు. ముద్దులు పెడుతారు. పక్కనే పడుకోబెట్టుకొని ఆ స్పర్శను ఎంజాయ్ చేస్తారు. అలాగే పాములు కూడా వారి టచ్, కేరింగ్ కు ఫిదా అయిపోతాయో ఏమో అవి కూడా అలాగే ప్రేమగా దగ్గరికి వస్తాయి. సెక్యూర్ గా ఉన్నామని ఫీల్ అయిపోతాయి.

ఇలాంటి ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఫుటేజీలో భయంకరమైన కింగ్ కోబ్రా(King Cobra)ను కేరింగ్ గా పట్టుకున్న యువతి.. దాని తలపై కిస్ పెట్టింది. ఆ తర్వాత ఫొటోలకు పోజులిచ్చింది. ఇక దీనిపై రియాక్టు అయిన నెటిజన్లు.. ఆ అమ్మాయి గట్స్ కు మెచ్చుకుంటున్నారు. ఎంత సులభంగా పామును లొంగదీసుకుంది అని కామెంట్స్

పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం విషపు పాముతో ఆటలేంటి జాగ్రత్తగా ఉండాలి కదా అని సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకు 17వేలకు పైగా లైక్స్ రాగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


Similar News