Divorce : భార్యాభర్తల విడాకులకు కారణమైన ఐదు రూపాయల కుర్ కురే(Kur Kure)..

ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన భార్యాభర్తలు విడిపోయేందుకు కారణమైంది ఐదు రూపాయల కుర్ కురే ప్యాకెట్. ఈ చిప్స్ టేస్ట్ కు అడిక్ట్

Update: 2024-05-14 09:29 GMT

దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన భార్యాభర్తలు విడిపోయేందుకు కారణమైంది ఐదు రూపాయల కుర్ కురే ప్యాకెట్. ఈ చిప్స్ టేస్ట్ కు అడిక్ట్ అయిన భార్య.. ప్రతిరోజూ తీసుకురావాలని అడిగేది. కానీ ఒకరోజు మరిచిపోవడంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అది కాస్తా చిలికి చిలికి గాలి వానగా మారిపోయింది. ఈ తగాదాల నడుమ పుట్టింటికి చేరిన ఆమె.. భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అధికారులను ఆశ్రయించింది.

ఆగ్రాలోని షాహ్ గంజ్ పోలీసులు ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించారు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని సూచించారు. ముందుగా ఈ చిప్స్ గురించి వైఫ్ పదేపదే కోరడం.. భర్తకు ఆందోళన కలిగించింది. ఇలాంటి అలవాటు మనుకోవాలని సూచించడంతో వివాదాలు తలెత్తాయి. కాగా ఈ క్రమంలో భార్య గృహహింస ఆరోపణలు చేయడం గమనార్హం.

Similar News