Trending: ‘యధో కర్మ తథో గతిః’.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓల్డ్ ఫొటో

‘యధో కర్మ తథో గతిః’.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఓ తారక మంత్రం.

Update: 2024-05-24 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘యధో కర్మ తథో గతిః’.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఓ తారక మంత్రం. ‘ఎవడు చేసిన కర్మను వారు అనుభవిస్తారని ఆ పదాలకు అర్థం. అయితే, ఇప్పుడు ఇతిహాసాల గురించి ఎందుకు అని అనుకునేరు. ఇటీవల జరిగిన ఓ ఘటన ఆ శ్లోకానికి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. తాజాగా, ఈ నెల 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు, ఈదురు గాలులతో తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌లోని పర్వతాల మధ్య కుప్ప కూలింది. అయితే, ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఓల్డ్ ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్త రాసినందుకు గాను ఓ జర్నలిస్ట్‌కు మరణ శిక్ష విధించాడు. నడిరోడ్డుపై ఓ భారీ క్రేన్‌కు తాడు కట్టి.. కన్న కూతురు ఎదుటే అతడి మెడకు ఉరి బిగించారు. ఆ భయానక దృశ్యాలు చూసిన చిన్నారి ని చివరి క్షణాల్లో నవ్వించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అక్కడున్న వారితో కన్నీళ్లు పెట్టించింది. తాను చనిపోతానని తెలిసినా.. ఏ మాత్రం బాధపకుండా ప్రశాంతంగా ప్రాణాలను విడిచాడు. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతం ప్రకారం.. పుట్టిన మనిషి కొంత కర్మ చేసి ఉండొచ్చు, ఆ కర్మ ఫలమే నేడు ఇరాన్ అధ్యక్షుడి ఇబ్రహీం రైసీని కాల నాగులా కాటేసిందని నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.   

Tags:    

Similar News