Trending: కశ్మీర్‌లో రియల్ హీరోస్.. నదిలో దూకి బాలుడి ప్రాణాలు కాపాడిన యువకులు (వీడియో వైరల్)

ఈ రోజుల్లో ఏదైనా సాహసం చేయాలంటే గట్స్ ఉండాల్సిందే.

Update: 2024-05-27 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో ఏదైనా సాహసం చేయాలంటే గట్స్ ఉండాల్సిందే. తమ ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు.. అవతలి వాళ్ల ప్రాణాలను కాపాడాలనే సంకల్పం మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే వారిని నిజ జీవితంలో రియల్ హీరోలను చేస్తుంది. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని ఒడ్డుపై ఉన్న ఇద్దరు యువకులు గమనించారు. చూసి చూడగానే.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి బాలుడిని చాకచక్యంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఒడ్డుపై బాలుడిని పడుకోబెట్టి కడుపులో ఉన్న నీరును తీసి.. సీపీఆర్ చేసి బాలుడిని బతికించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ నెటిజన్ తన సెల్‌ఫోన్‌లో రికార్ట్ చేసి ట్విట్టర్ పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.  

Tags:    

Similar News