Trending: దున్నపోతు చేతిలో ప్రాణాలు విడిచిన మృగరాజు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

అన్ని సమయాల్లో కాలం ఒకేలా ఉండదు. ప్రతిసారి గెలుపు ప్రత్యర్థిదే అయితే బాధ పడాల్సిన అవసనము లేదు.

Update: 2024-05-23 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్ని సమయాల్లో కాలం ఒకేలా ఉండదు. ప్రతిసారి గెలుపు ప్రత్యర్థిదే అయితే బాధ పడాల్సిన అవసనము లేదు. మనకంటూ గెలిచే ఓ రోజు వస్తుందని వేచి చూసే వాడే అసలైన విజేత అవుతాడు. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే ఓ అడవిలో చోటుచేసుకుంది. ‘ది ఇన్‌స్టిగేటర్’ అనే ట్విట్టర్ యూజర్ కారడవిలో అడివి దున్న, సింహం పోరాడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. అయితే, ఆ వీడియోలో దున్నపోతును సింహం వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే చాకచక్యంగా దున్న తన పదునైన కొమ్ములతో సింహాన్ని ఓ రేంజ్‌లో కుమ్మి పడేసింది. దీంతో సింహానికి గాయాలై నెత్తురొడుతున్నా.. దున్న పైకి దూసుకెళ్లింది. అయిన పట్టు విడవని విక్రమార్కుడిలా ఆ దున్న సింహాన్ని ఓడించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో 1.4 మిలియన్ వ్యూస్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  

Trending video

Tags:    

Similar News