వధువును ప్రేమించానంటూ.. పెళ్లి వేదికపై వరుడికి షాకిచ్చిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)

ఇటీవల కాలంలో పెళ్లి వేదికపై షాకింగ్ సంఘటనలు చోటుచేసుకుంటూ ఒక్కోసారి వివాహాలు ఆగిపోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-10 07:56 GMT

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో పెళ్లి వేదికపై షాకింగ్ సంఘటనలు చోటుచేసుకుంటూ ఒక్కోసారి వివాహాలు ఆగిపోతున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలతో గొడవలు జరిగి తీరా తాళి కట్టే సమయానికి పెళ్లి ఆగిపోతుంది. లేదా తనకు ఆ వివాహం ఇష్టం లేదని చెప్పి కొందరు ఇంట్లో నుంచి పారిపోతున్నారు. లేదా ప్రేమించిన వారిని పిలిపించుకుని పెద్దలను ఒప్పించి అదే వేదికపై పెళ్లాడుతున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా, ఓ పెళ్లిలో జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధువు వేదికపై ఉండగా.. వరుడు ఆమె దగ్గరకు వెళుతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు సడెన్‌గా స్టేజ్‌పైకి వెళ్లి వధువును ప్రేమిస్తున్నానని చెప్పడంతో వరుడు షాక్‌తో అలాగే నిల్చొని చూస్తుంటాడు. ఆ యువకుడు కాసేపు అలాగే స్టేజ్‌పై నిల్చొని కోపంగా అందరికీ ఏదో చెప్తూ కనిపించాడు. అయితే ఈ వీడియోకు ఏదో మ్యూజిక్ యాడ్ చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా ఫన్నీ కోసం చేశారని ఫ్రాంక్ అని అంటున్నారు. అలాగే కొందరు అతను ఫొటోగ్రాఫర్ అదంతా పెళ్లికి వచ్చిన వారిని అలరించేందుకు చేశాడని కామెంట్లు పెడుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News