Viral Video: చల్లదనం కోసం గాల్లో వాటర్ స్ప్రే.. వీడియో వైరల్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

Update: 2024-04-30 05:53 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దేశంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. అయితే గతంలో ఇదే పరిస్థితి సౌదీ అరేబియాలో నెలకొంది. ఆ సమయంలో ప్రజలకు వేడి తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం గాల్లో వాటర్ స్ప్రే విధానాన్ని అనుసరించింది.

ప్రస్తుతం మన దేశంలో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 నుంచి 50 డిగ్రీల వరకు నమోదైంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా గాల్లో వాటర్ స్ప్రే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు. అలానే గతంలో సౌదీ అరేబియా గాల్లో వాటర్ స్ప్రే చేసిన వీడియోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

దీనితో ప్రస్తుతం ఆ వీడియోలు కాస్త వైరల్‌గా మారాయి, ఆ వీడియోలు చూసిన నిటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మంచి పని చేస్తున్న సౌదీ అరేబియా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. మరి కొంతమంది అప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు భారీ వరదలు వస్తున్నాయని ఎద్దేవ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. గాల్లో వాటర్ స్ప్రే వీడియోలను మీరు ఒకసారి చూసేయండి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News