ఆ బాబా తెలివికి హ్యాట్సాఫ్.. స్కూటీ పై ఎండ తగలకుండా ఏం చేశాడో చూడండి..

అప్పుడప్పుడు కొన్ని వింత విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి.

Update: 2024-05-23 08:42 GMT

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడు కొన్ని వింత విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అలాంటి విన్యాసాలకు మన దేశంలో కొదవ లేదు. అలాంటి వీడియోలు బయటికి వచ్చినప్పుడల్లా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వీడియోని చూస్తే మీరు కూడా ఫిదా కావాల్సిందే.

వేసవి కాలం తారాస్థాయికి చేరుకునే సమయం ఇది. వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం మర్చిపోండి. దాని గురించి ఆలోచిస్తేనే పరిస్థితి దిగజారుతుంది. వేడిమిని తట్టుకోవడం ద్విచక్ర వాహనదారులకు కష్టసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు బయటికి వచ్చిన వీడియోలో దానికి పరిష్కారాన్ని చూపించాడు ఓ బాబా. ఆ బాబా తన స్కూటర్‌ పై ఓ ఛెత్రిని అమర్చి హ్యాపీగా జర్నీ చేస్తున్నాడు. దీంతో ఆ వ్యక్తి ఎండ నుంచి తనను తాను రక్షించుకోవడంతోపాటు ఎండలో కూడా ఆనందంతో స్కూటర్‌ను నడపగలుగుతున్నాడు. ఈ వీడియోని చూసినవారంతా X కామెంట్ బాక్స్‌లో ఈ వీడియో పై రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News