మండపంలోకి ఎంట్రీ ఇస్తున్న వధూవరులకు అంటుకున్న మంటలు.. చివరికి ఏం జరిగిందంటే? (వీడియో)

ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి లోని వేడుకలు వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Update: 2024-05-24 11:07 GMT

దిశ,ఫీచర్స్: ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి లోని వేడుకలు వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. వివాహం జీవితంలో ఒక్కసారే చేసుకుంటారు కాబట్టి భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కానుంచి పెళ్లి వరకు అన్ని భిన్నంగా ప్లాన్ చేసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అయితే కొందరు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌ను సినిమా రేంజ్‌లో చేసుకుంటే.. మరికొందరు మాత్రం స్టేజిపై వధూవరుల ఎంట్రీ ఆకర్షనీయంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొందరు వినూత్నంగా అరేంజ్ చేసుకుని అతిథులంతా షాక్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఇందులో చుట్టూ అతిథులంతా ఉండగా.. వధూవరులు చేతులు పట్టుకుని వస్తున్నారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వారి వీపు భాగాన మంటలు అంటించి మండుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే వారు వేదికపైకి చెట్టాపట్టాలేసుకుని పరుగెడుతూ వెళ్తున్నారు. ఇక వధూవరులు మధ్యలోకి వెళ్లాక మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు. అయినప్పటికీ వరుడు, వధువు నడవడం ఆపలేరు.

అయితే వధూవరుల వెనక ఒకతను మంటలు ఆర్పేందుకు సిలిండర్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. వధూవరులు పరుగెడుతుండగానే వీడియో అయిపోతుంది. చివరికి వారు మండపానికి చేరుకున్నాక మంటలు అర్పేసి పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా ఇదేం క్రియేటివిటీరా బాబు అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Similar News