ఆటోను ఏకంగా ఇల్లు ఎక్కించేశిన డ్రైవర్!.. ఎందుకో తెలుసా? (వీడియో వైరల్)

కనిపెంచిన తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Update: 2024-05-25 15:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కనిపెంచిన తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. తన కుటుంబాన్ని పోషించిన ఆటోను వదిలేయకుండా ఆటో డ్రైవర్ ఏకంగా ఇళ్లు ఎక్కించేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆటో నడుపుకొని జీవనం సాగించే ఓ వ్యక్తి ఆటోను ఏకంగా తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్ని రోజులు తనతో పాటు తన కుటుంబానికి అన్నం పెట్టి తనని ప్రయోజకుడ్ని చేసిన ఆటోకు కృతజ్ఞత చూపించాడు. ఆ ఆటో డ్రైవర్ కు సొంతింటి కల ఉండేది.

ఆటో నడుపుకోవడం వల్లే తాను బ్రతికి మరికొంత డబ్బు పోగుచేసుకొని ఓ ఇళ్లు కట్టుకున్నానని, తన సొంతింటి కలను నిజం చేసిన ఆటోను వదిలేయకుండా అదే ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చూసిన జనం ఆశ్చర్యానికి లోను అవుతున్నారు. ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. కన్నవాళ్లనే గాలికి వదిలేస్తున్నారు. నువ్వు ఆటోను కూడా విడిచిపెట్టట్లేదు గ్రేట్ అని ఓ నెటిజన్ అనగా.. ఆటో కాబట్టి సరిపోయింది, ఒక వేళ లారీ వల్ల బాగు పడితే ఏం చేసేవాడివి అని మరో నెటిజన్ ఫన్నీగా స్పందిచాడు.

Full View

Similar News