అమ్మాయి కాదు.. అబ్బాయి..!

కర్లీ హెయిర్.. కళ్లకు కాటుక.. స్మైలింగ్ ఫేస్.. ఒంటి నిండా చీర.. ఈ ఫోటోలోని యువతిని చూస్తే మగాళ్ల మతులు పోవడం ఖాయం.

Update: 2023-03-29 11:05 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్లీ హెయిర్.. కళ్లకు కాటుక.. స్మైలింగ్ ఫేస్.. ఒంటి నిండా చీర.. ఈ ఫోటోలోని యువతిని చూస్తే మగాళ్ల మతులు పోవడం ఖాయం. మోనాలిసాకు చీర కడితే ఈమెలాగే ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఆడవాళ్లకే ఈర్ష్య పుట్టించేంత అందంగా ఉన్న ఈ యువతి నిజంగా మహిళ కాదు.. ఓ మగాడు. కేరళలోని కొల్లం జిల్లా కొట్టంకులకరలో ఓ దేవీ గుడి ఉంది. ఇక్కడ చమయవిలక్కు అనే పండుగను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతుంటారు.

ఈ పండుగలో భాగంగా మగాళ్లు ఆడవాళ్ల వేషధారణతో పూజలో పాల్గొంటారు. అందులో భాగంగా ఓ పురుషుడు ఇలా అందమైన యువతి వేషం వేసుకొని వచ్చాడు. ఇక ఈ ‘మగ ఆడవాళ్ల’ పోటీలో ఈయనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక అనంత్ రూపనాగుడి అనే ఓ రైల్యే ఉద్యోగి ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేయగా.. వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

Tags:    

Similar News