రీల్స్ పిచ్చి.. వీడియో చేస్తూ ప్రాణం పోగొట్టుకున్న యువకుడు (వీడియో)

ఈ రోజుల్లో చాలా మంది యువత సోషల్ మీడియాకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.

Update: 2024-05-27 09:32 GMT

దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మంది యువత సోషల్ మీడియాకు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అందులో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. బైక్ స్టంట్లు, హైవే రోడ్లపై డ్యాన్సులు, ఎక్కువ రద్ది ఉన్న ప్లేసులో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వింత వింత విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. ఇలా చెయ్యడం వల్ల కొంత మంది ఫేమస్ అవుతుంటే మరికొందరూ పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇంకొంత మంది అయితే.. తమ ప్రాణాలో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

ఉత్తరాంధ్ర నౌ! అనే అకౌంట్ ద్వారా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ‘ఓ పెద్ద వంతెన వద్ద యువకుడు నిలబడి ఉన్నాడు. అయితే.. అది చాలా లోతుకు ఉంది. వేరే వ్యక్తి వీడియో తీస్తుండగా.. ఆ యువకుడు పై నుంచి వాటర్‌లోకి దూకేశాడు. ఇక వాటర్‌లో పడిన తర్వాత కొంత సేపు స్విమ్ చేసిన యువకుడు కొద్దిసేపటికి మునిగిపోయాడు’. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పనులు చేసి ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు.

Similar News