KSRTC: ఒక చేతిలో స్టీరింగ్.. మరో చేతిలో గొడుగు.. ఆర్టీసీ డ్రైవర్ నిర్వాకం..

ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేతిలో గొడుగు పట్టుకోని డ్రైవింగ్ చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Update: 2024-05-25 05:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేతిలో గొడుగు పట్టుకోని డ్రైవింగ్ చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ చేతిలో గొడుగు పట్టుకోని ప్రమాదకరంగా ఒక చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు. వర్షం కారణంగా బస్సులో వర్షపు నీరు లీకేజీ కావడంతో డ్రైవర్ ఇలా చేయాల్సి వచ్చింది. ఇలా ఒక చేతిలో స్టీరింగ్, ఒక చేతిలో గొడుగు బ్యాలెన్స్ చేస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ తో పాటు, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతదని, ట్విట్టర్ (ఎక్స్) ద్వారా కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి.

వర్షానికి లీకేజీ అవుతుంది.. మరి ఏమ్ చేయమంటారు.. డ్రైవర్‌ను అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. అలాగే డ్రైవర్లకు గొడుగు గ్యారెంటీ ఇచ్చిందని ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. రవాణా శాఖ ప్రయాణికుల జీవితాలతో ఆటలాడుతోందని, ముందు సరైన బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేఎస్‌ఆర్‌టీసీ ఈ ఘటనపై స్పందించింది. వర్షం కురుస్తున్న సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో కండక్టర్ అనిత వీడియో చిత్రీకరించారని కేఎస్‌ఆర్‌టీసీ సంస్థ స్పష్టం చేసింది.

Tags:    

Similar News