వరకట్న కాలిక్యులేటర్.. టూల్ ఇచ్చే ట్విస్ట్ చూశారంటే అదుర్స్..

అభివృద్ధి చెందిన ఏ సమాజానికైనా వరకట్నం ఒక శాపం.

Update: 2024-05-22 09:46 GMT

దిశ, ఫీచర్స్ : అభివృద్ధి చెందిన ఏ సమాజానికైనా వరకట్నం ఒక శాపం. వరకట్నం కారణంగా బాలిక తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వరకట్న వ్యవస్థకు స్వస్తి పలకాలని ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రచారం నిర్వహిస్తుంది. నేటికీ సమాజంలో వరకట్న ఆకలితో అలమటించే వారు, వేరొకరి కూతుళ్లను ఇంటికి తీసుకురావడానికి ముందే మంచి మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. నేటికీ 21వ శతాబ్దంలో దేశంలోని చాలా ప్రాంతాలలో ఏదో ఒక రూపంలో కట్నం తీసుకొని వివాహాలలో ఇస్తున్నారు. చూస్తుంటే సమాజంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటే సామాన్యులదే.

భారతదేశంలో 1961లో వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చినప్పటికీ, నేటికీ వివాహాల్లో ఇది సాధారణ పద్ధతి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2022లో 6,450 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి చట్టం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో వరకట్న మరణాలు, వేధింపుల కేసులు ప్రతిరోజూ ఎన్ని వెలుగులోకి వస్తున్నాయో. అలాంటప్పుడు ఏదైనా మ్యాట్రిమోనియల్ సైట్‌లో వరకట్నం గురించి బహిరంగంగా మాట్లాడితే దాని గురించి మీరు ఏమి చెబుతారు ? సహజంగానే ఇలాంటి వాటిపై కట్నం తీసుకునే వారికి కోపం వస్తుంది. అలాంటి ఒక 'కట్నం కాలిక్యులేటర్' ఫీచర్ గురించి ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది.

షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి అనుపమ్ మిట్టల్ యజమాని అయిన మ్యాట్రిమోనియల్ సైట్ Shaadi.comలో మీరు 'వరట్న కాలిక్యులేటర్' ఈ ఫీచర్‌ని చూడవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వరుడు ఎంత కట్నానికి అర్హులో తెలుసుకోవచ్చంటారు. మీరు Shaadi.com ఈ ఫీచర్‌ని తెరిచినప్పుడు మీ ముందు సూట్‌లో ఉన్న వ్యక్తిని మీరు చూస్తారు. అదే సమయంలో అతని చుట్టూ ఇళ్లు, పుస్తకాలు, కార్లు, బోలెడంత డబ్బు కనిపిస్తుంటాయి. కొన్ని ప్రశ్నలు క్రింద ఇస్తారు. ఇందులో వరుడి వయస్సు, చదువు, ఉద్యోగం, ఆదాయం, వారి స్వంత ఇల్లు ఉందా లేదా అనే విషయాలను అడుగుతుంది.

మీరు ఈ వివరాలన్నింటినీ పూరించినప్పుడు చివరకు కట్నం మొత్తం అనే ఒక బటన్ కనిపిస్తుంది. అయితే మీరు Shaadi.com ను తిట్టడానికి ముందు, ఈ ఫీచర్‌లో ఓ పెద్ద ట్విస్ట్ ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు కాలిక్యులేటర్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు ఈ ఫీచర్ ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది. మీరు బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే అది రాసిన సందేశం కనిపిస్తుంది - 2001, 2012 మధ్య, కట్నం కారణంగా 91,202 మరణాలు సంభవించాయి అని కనిపిస్తుంది. ఈ సాధనం ఇచ్చే ట్విస్ట్ చూసిన తర్వాత మీరు కూడా ఈ క్యాలిక్యులేటర్ ని అభినందిస్తారు.

ఒక మాజీ వినియోగదారు 'వరకట్నం కాలిక్యులేటర్' ఫీచర్‌ను పోస్ట్ చేశారు. షాదీ.కామ్‌లో ఈ రచ్చ అంతా ఏమిటని కొంతమంది అనుకుంటారు. కానీ వరకట్న దురాశపరుల కళ్లు తెరిపించే అద్భుతమైన ఆలోచన ఇది. కొద్దిసేపటికే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రజలు తమ స్పందనలను నమోదు చేయడం ప్రారంభించారు.

చాలా మంది వినియోగదారులు దీన్నిచూసి ప్రశంసించగా, కొందరు వ్యక్తులు అందమైన జీతంతో ఏకైక కొడుకు కోసం వెతకడం కట్నం కంటే తక్కువ కాదని చెబుతున్నారు. అలాగే భరణం పేరుతో భారీగా డబ్బులు తీసుకోవడం కూడా కట్నం లాంటిదే అంటున్నారు.

Similar News