ఈసారి మరింత వినూత్నంగా డిజైన్.. సోషల్ మీడియాను కుదిపేస్తోన్న వెడ్డింగ్ కార్డు

ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్ అయ్యేందుకు ఎలాంటి పనిచేసేందుకైనా జనాలు వెనుకాడటం లేదు. నడిరోడ్డుమీద డ్యాన్సులు చేయడం, ఆపరేషన్ థియేటర్‌లో రీల్స్ చేయడం వంటి ఘటనలు అనేకం చూస్తు్న్నాం.

Update: 2024-04-28 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్ అయ్యేందుకు ఎలాంటి పనిచేసేందుకైనా జనాలు వెనుకాడటం లేదు. నడిరోడ్డుమీద డ్యాన్సులు చేయడం, ఆపరేషన్ థియేటర్‌లో రీల్స్ చేయడం వంటి ఘటనలు అనేకం చూస్తు్న్నాం. ఇటీవల కాలంలో పెళ్లి కార్డుల విషయంలోనూ వినూత్నంగా ఆలోచించి కొత్తగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే అవి వైరల్ కూడా అవుతున్నారు. తాజాగా ఇలాంటి వెడ్డింగ్ కార్డే నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, హీరోల ఫొటోలు, రాజకీయ నాయకుల ఫొటోలు ఉన్నాయనుకుంటే పొరపాటే. ఓ వ్యక్తి తన వెడ్డింగ్ కార్డులో పెంపుడు కుక్కల ఫొటోలు వేయించుకున్నాడు.


ఈ రకంగా తన పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమను చూపించాడు. మధ్యప్రదేశ్‌లోని రాణిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితం యశ్వంత్ వ్యక్తి స్కూటర్ కింద కుక్కపిల్ల పడింది. ఈ క్రమంలో ఆ కక్కకు కొన్ని గాయాలు అయ్యాయి. దీంతో చలించిపోయిన యశ్వంత్ ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నాడు. ఆ తర్వాత పెంపుడు కుక్కలపై మరింత ఇష్టపెరిగిపోయి దానికి తోడు మరో రెండు కుక్కలను కొనుగోలు చేశాడు. ఇటీవల తన వివాహం సందర్భంగా హల్దీ, సంగీత్, పెళ్లి ఊరేగింపులోనూ వీటిని భాగం చేశాడు. దీంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

Tags:    

Similar News