పోలీస్ డ్రెస్ లో అచ్చం సినిమా స్టైల్ లో నటించారు (వీడియో)

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగిస్తున్న వారికి ఫాలోయింగ్ పిచ్చి కూడా పెరుగుతోంది.

Update: 2024-05-26 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగిస్తున్న వారికి ఫాలోయింగ్ పిచ్చి కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం హోదాతో సంబందం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ లో మహిళా పోలీస్ అధికారులు చేసిన సినిమా రీల్ వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ మహిళా పోలీస్ తన ఉన్నతాధికారితో కలిసి ఓ పాత హిందీ సాంగ్ కు నటించింది. ఇందులో పోలీస్ డ్రెస్ లో అచ్చం సినిమాలో లాగా నటిస్తూ.. హొయలు కురిపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని పోస్ట్ చేసిన ఓ నెటిజన్ యూనిఫారంలో ఉన్న ఈ మహిళలు పూర్తిగా సినిమా స్టైల్ లో నటించారని, ఇది యూపీలోని ఏ పోలీస్ స్టేషన్ లో చేయబడందో నాకు చెప్పండి అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వీళ్లు నిజంగా పోలీసులా? లేక సినీ యాక్టర్ల అని, ఇలాంటి వాళ్లు సమాజాన్ని ఏం రక్షిస్తారు అని, ఫాలోయింగ్ పిచ్చిలో హోదాను కూడా మరిచారా అని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Similar News