సముద్రం నుండి బయటికి వచ్చిన గ్రహాంతరవాసి లాంటి వింత జీవి..

సముద్ర ప్రపంచం కూడా మానవ ప్రపంచం లాగే చాలా వింతగా ఉంటుంది.

Update: 2024-05-25 14:44 GMT

దిశ, ఫీచర్స్ : సముద్ర ప్రపంచం కూడా మానవ ప్రపంచం లాగే చాలా వింతగా ఉంటుంది. సముద్రంలో చాలా రకాల వింత జీవులను చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని సార్లు కొన్ని జీవులను చూస్తే చాలు ఆశ్చర్యంగా, భయంకరంగా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది యానిమేషన్ సినిమాలో కనిపించే ఓ జీవిలా కనిపిస్తుంది. దీనిని చూసిన తరువాత ప్రజలు ఖచ్చితంగా గ్రహాంతర జీవి అని పిలవడంలో ఆశ్చర్యపోనవసరం లేదు.

వైరల్ అవుతున్న ఈ చిత్రం పసిఫిక్ మహాసముద్రం తీరానికి చెందినది. ఇక్కడ ఒక జీవి ఉంది. దీనిని మనమందరం ఫైండింగ్ నెమో చిత్రంలో చూడవచ్చు. అయితే ఈ వింత జీవిని పసిఫిక్ ఫుట్‌బాల్ ఫిష్ అని పిలుస్తారు. ఈ జీవి సముద్రపు లోతుల్లో కనిపిస్తుంది. అయితే ఇది ఒడ్డుకు ఎలా వచ్చింది అనేది అందరిలో వచ్చే ఓ సందేహం.

స్థానిక మెరైన్ మ్యూజియం సీసైడ్ అక్వేరియం ఈ జీవి గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు అలాంటి కొన్ని జీవులు మాత్రమే ఇక్కడ కనుగొన్నారు. ఈ చేపకు సంబంధించిన జాతికి చెందిన నమూనాలను ప్రపంచవ్యాప్తంగా 31ని మాత్రమే కనుగొన్నారు. ఇందులో న్యూజిలాండ్, జపాన్, రష్యా, హవాయి, ఈక్వెడార్, చిలీ, కాలిఫోర్నియా వంటి దేశాలు ఉన్నాయి.

ఈ జీవికి సంబంధించి శాస్త్రవేత్తలు ఈ జీవులు పరాన్న జీవుల వలె కనిపించినప్పటికీ మగ, ఆడ మధ్య తేడా లేదని చెప్పారు. వాటితో కనెక్ట్ అవ్వడానికి అవే ఆడవారి కోసం వెతుకుతూ ఉంటారు. అంతే కాదు వారు తమ ఎరను ఆకర్షించడానికి వాటి నుదిటిపై ఫాస్ఫో రేసెంట్ బల్బుల నుంచి కాంతిని ఉపయోగిస్తారు.

Tags:    

Similar News