బీర్ క్యాన్లతో లక్షాధికారి అయిన వ్యక్తి.. ఒక్కో డబ్బా ఖరీదు ఎంతో తెలిస్తే షాక్..

మద్యం సేవించడం ప్రతి వ్యక్తికి హానికరం. ఇది శరీరానికి మాత్రమే కాదు, జేబుకు కూడా హానికరం.

Update: 2024-05-09 15:24 GMT

దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ప్రతి వ్యక్తికి హానికరం. ఇది శరీరానికి మాత్రమే కాదు, జేబుకు కూడా హానికరం. చాలా సార్లు మద్యం వల్ల కుటుంబం నాశనం అవుతుంది. అయితే మద్యం తాగే అభిరుచి ఉన్న మనిషి ఫేట్ మారిపోయింది. మద్యం వల్ల ఫేట్ మారిన వ్యక్తి ధనవంతుడయ్యాడు. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా పచ్చి నిజం. ప్రస్తుతం ఈ విషయం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటన్ నివాసి 65 ఏళ్ల నిక్ వెస్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన గత 42 సంవత్సరాలుగా బీర్ క్యాన్లను సేకరిస్తున్నాడు. ఈ అభిరుచి కారణంగా అతని ఇంట్లో 10,300 బీర్ డబ్బాలు పేరుకుపోయాయి. వాటిలో కొన్ని చాలా అరుదుగా దొరికేవి. తాను 16 ఏళ్ల వయసులో ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. స్టాంపులు, ఇతర వస్తువులను సేకరించడం ఆయనకు ఇష్టమట. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి మద్యానికి బానిసై బీరు విపరీతంగా తాగడం మొదలుపెట్టారు.

ఈ డబ్బాలను ఎంత ధరకు విక్రయించారు ?

బీరులకు ఎంతగానో అలవాటు పడిన ఆ వ్యక్తి బీర్ క్యాన్లను నిల్వ ఉంచడం ప్రారంభించాడట. అది తనకు ఆనందాన్ని కలిగించింది. తన హాబీల వల్ల తన గది చిన్నగా మారడం ప్రారంభం అయ్యింది. దీని తర్వాత ఆయన తన అభిరుచిని మానుకోలేక 5 బెడ్‌రూమ్‌ల ఇంటిని అద్దెకు తీసుకున్నాడట. కానీ పదవీ విరమణ తర్వాత తాను డబ్బు కొరతను ఎదుర్కోవడం ప్రారంభం అయ్యిందట. ప్రస్తుతం ఆ డబ్బాలను ఉంచడానికి స్థలం లేకుండా పోయింది. అందుకే ఈ వేస్ట్ పెట్టెల్లో కొన్నింటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి 6000 డబ్బాలను విక్రయించారు. ఈ డబ్బాలన్నీ చాలా ప్రత్యేకమైనవి కాబట్టి $13500 (రూ. 14 లక్షలు) పలికింది.

దీని తర్వాత తాను ఇటలీలోని బీర్ క్యాన్ డీలర్‌లకు 1,800 డబ్బాలను విక్రయించాడట. దానికి ప్రతిఫలంగా ఆ వ్యక్తి $12,500 అందుకున్నాడు. అయితే తాను ఆ డబ్బాల్లో చాలా వరకు బ్రిటిష్ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడట. ఇది కాకుండా తన దగ్గర అలాంటివి మరో మూడు డబ్బాలు ఉన్నాయని తెలిపారు. అవి చాలా అరుదుగా కనిపించేవట. దాని డిజైన్, సరళత తనకు నచ్చినందుకే తాను దానిని ఉంచాడని తెలిపారు. నిక్ వెస్ట్ ఇంకా మాట్లాడుతూ తాను కలిగి ఉన్న పురాతన బీర్ 1936 నాటిదని తెలిపారు.

Similar News