78ఏళ్ల వృద్ధుడు, 18ఏళ్ల అమ్మాయితో లవ్ మ్యారేజ్.. మూడు ఏళ్లు డేటింగ్ తర్వాత

ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు.

Update: 2022-10-05 15:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఒకరు యుక్త వయస్సులో లవ్ చేసుకుంటే మరొకరు వృద్ధప్యంలో ప్రేమించుకుంటారు. అయితే ప్రేమకు ఏజ్‌తో సంబంధం ఉండదనడానికి ఈ 78ఏళ్ల వృద్ధుడు, 18ఏళ్ల అమ్మాయి లవ్ మ్యారేజే నిదర్శనం.

ఫిలిప్పిన్‌లో ఉంటున్న 78ఏళ్ల రషెడ్ మంగాకోప్ అనే వృద్ధుడు 18ఏళ్ల హలీమా అబ్దుల్లా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని నెటిజన్లు విస్తుపోయేలా చేశాడు. అయితే గతంలో ఓ విందులో కలిసిన వీరిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపారేసుకున్నారు. దీంతో అమ్మాయికి 15ఏళ్ల వయస్సు నుంచే వీరిద్దరూ 3ఏండ్లపాటు డేటింగ్ చేసుకున్నారు. చివరికి ఇరుకుటుంబాలు వారి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకోవడంతో వారి ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. ఇకపోతే రషెడ్ మంగాకోప్‌కు ఇప్పటి వరకు వివాహం జరగలేదని.. ఏ అమ్మాయితో రిలేషన్ కూడా లేదని అతడి మేనల్లుడు వివరించాడు.

Similar News