‘ట్రాజెడీ కింగ్’ ఇకలేరు..

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఆదివారం ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డిశంబర్ 11, 1922లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్ కాగా.. 1944లో ‘జ్వార్ భాటా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. జుగ్ను(1947) ఆయన ఫస్ట్ హిట్ మూవీ కాగా.. ‘జోగన్‌’, […]

Update: 2021-07-06 21:26 GMT

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఆదివారం ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డిశంబర్ 11, 1922లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్ కాగా.. 1944లో ‘జ్వార్ భాటా’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. జుగ్ను(1947) ఆయన ఫస్ట్ హిట్ మూవీ కాగా.. ‘జోగన్‌’, ‘బాబుల్‌’, ‘దేవ్‌దాస్’, ‘ఫుట్‌పాత్‌’, ‘ఆజాద్‌’ ‘లీడర్‌’, ‘కోహినూర్‌’, ‘ధునియా’ వంటి సినిమాలు ఆయనను స్టార్‌గా నిలబెట్టాయి. ‘దీదార్’, ‘అమర్’, ‘దేవదాస్’, ‘మధుమతి’ సినిమాల్లో ఆయన నటనకుగాను ‘ట్రాజెడీ కింగ్’ అనే బిరుదు ఇచ్చేశారు ప్రేక్షకులు. సినిమాల్లో మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ ప్రవేశపెట్టిన దిలీప్ కుమార్.. ‘ది ఫస్ట్ ఖాన్’గాను కీర్తించబడ్డాడు. 1944-98 వరకు హిందీ చిత్రసీమను ఏలిన ఈ లెజెండ్ కెరియర్‌లో… కే ఆసిఫ్ నిర్మాణసారథ్యంలో వచ్చిన పౌరాణిక చిత్రం ‘మొఘల్ ఎ ఆజం’ రికార్డులు సృష్టించింది.

సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గాను 1994లో ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’తో సత్కరించబడ్డ దిలీప్ కుమార్… పద్మ విభూషణ్, పద్మ భూషణ్‌తో గౌరవించబడ్డారు. ఆయన నటనకు ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

Tags:    

Similar News