రేపు రాజ్‌భవన్‌ రూట్‌లో ఆంక్షలు.. ఎందుకంటే?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య అతిథుల నడుమ జరిగే కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకారం ఉదయం 11.30 గంటలను జరగనుండగా… 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజ్‌భవన్ రోడ్డు నుంచి రాజీవ్ గాంధీ […]

Update: 2021-01-06 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య అతిథుల నడుమ జరిగే కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకారం ఉదయం 11.30 గంటలను జరగనుండగా… 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజ్‌భవన్ రోడ్డు నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు.. అటు నుంచి వీవీ స్టాచు వరకు హెవీ ట్రాఫిక్ ఉంటున్న నేపథ్యంలో కార్యక్రమం ముగిసే వరకు ఈ దారుల్లో ఆంక్షలు విధించారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News