‘నిబంధనలు ప్రజలకేనా.. సీఎంకు వర్తించవా?’

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ను నియంత్రించడానికి మాస్క్‌లు తప్పనిసరి అని చెప్పిన సీఎం కేసీఆర్‌కు నిబంధనలు వర్తించవా? అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రశ్నించారు. కేబినేట్ సమీక్షా సమావేశంలో సీఎం‌తో సహా మంత్రులు మాస్క్‌లను అలంకార ప్రాయంగా మెడలో వేసుకోవడం ప్రభుత్వాధినేతలు నిబంధనలను అపహాస్యం చేయడానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశంపై స్పందిస్తూ నిరంజన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మాస్కు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం చలాన్లు రాసి […]

Update: 2020-05-18 08:48 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌ను నియంత్రించడానికి మాస్క్‌లు తప్పనిసరి అని చెప్పిన సీఎం కేసీఆర్‌కు నిబంధనలు వర్తించవా? అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రశ్నించారు. కేబినేట్ సమీక్షా సమావేశంలో సీఎం‌తో సహా మంత్రులు మాస్క్‌లను అలంకార ప్రాయంగా మెడలో వేసుకోవడం ప్రభుత్వాధినేతలు నిబంధనలను అపహాస్యం చేయడానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశంపై స్పందిస్తూ నిరంజన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మాస్కు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం చలాన్లు రాసి ప్రజల దగ్గర రూ.1000 ముక్కుపిండి వసూలు చేసిందన్నారు. ఈ నిబంధనలను ప్రకటించిన ప్రభుత్వాధినేతలు ఉల్లఘిస్తే ఎలాంటి శిక్షలు వేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు నిబంధనలను తుంగ్గలో తొక్కడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు తాము మాట్లాడే సమయంలో తప్ప నిబంధనల ప్రకారం మాస్కు ధరిస్తే ప్రజలకు ఆదర్శంగా ఉండేవారని నిరంజన్ అభిప్రాయపడ్డారు

Tags:    

Similar News