పంటపొలాల్లో ఏనుగుల బీభత్సం

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు-తమిళనాడు సరిహద్దుల్లో గజరాజులు బీభత్సం సృష్టించాయి. అటవీ నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగులు పంటపొలాలపై పడ్డాయి. యాదమరి మండలం డీకే చెరువు గ్రామంలో రైతులు పండించిన టమోటాలను ట్రే బాక్సుల్లో నిల్వచేశారు. వాటిని ఏనుగులు ధ్వంసం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఏనుగుల దాడిలో పాడవ్వడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Update: 2020-11-23 22:53 GMT

Tags:    

Similar News