తెలంగాణలో రైతుల బాధలు వర్ణణాతీతం : కోదండరామ్

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వీడి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోందరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు వినతి పత్రాన్ని అందించారు. వరి పండించే రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దళారీల దోపిడీ చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అరకొర సదుపాయాలతో […]

Update: 2021-06-14 11:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వీడి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోందరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు వినతి పత్రాన్ని అందించారు. వరి పండించే రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, దళారీల దోపిడీ చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వలనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అరకొర సదుపాయాలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, సరిపడా గోనె సంచులు లేకపోవడం. హమాలీలు లేకపోవడం, మిల్లులకు తరలింపులో జాప్యం జరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరిచారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో వేచిచూస్తున్న , వర్షాలకు ధాన్యం తడిసిన రైతుల బాధలు వర్ణణాతీతమన్నారు. నిబంధనల ప్రకారం.. తరుగు తీయకపోవడం, రశీధులు ఇవ్వకపోవడం వలన రైతులు దోపిడీకి గురువుతున్నారని వివరించారు. ఎఫ్‌సీఐ విడుదల చేసిన మార్గదర్శకాలను కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా పాటించడం లేదని చెప్పారు. తాలు ఎక్కువగా ఉందని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

Tags:    

Similar News