ఆ విధానాల వల్లే వారు కష్టాల్లో పడ్డారు…

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు కష్టాల్లో పడ్డారని ఆయన చెప్పారు. ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి పెనం మీద, ఉద్యోగులు పొయ్యిల్లో ఉన్నట్టుగా ఉందని ఆయన తెలిపారు. పనిభారంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనీ, వెట్టి కార్మికుల లాగా పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యలపై తనకు పూర్తి […]

Update: 2020-10-10 05:44 GMT

దిశ, వెబ్ డెస్క్:
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అటు నిరుద్యోగులు, ఇటు ఉద్యోగులు కష్టాల్లో పడ్డారని ఆయన చెప్పారు. ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి పెనం మీద, ఉద్యోగులు పొయ్యిల్లో ఉన్నట్టుగా ఉందని ఆయన తెలిపారు. పనిభారంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనీ, వెట్టి కార్మికుల లాగా పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన తెలిపారు. అందుకే పోరాడగలుగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీల మద్దతును కూడగట్టుతానని చెప్పారు. కాగా ప్రజలకు భరోసా కల్పించేందుకే పట్టభద్రుల ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని తెలిపారు.

Tags:    

Similar News