పైశాచికం.. దళిత బాలికలపై యాసిడ్ దాడి!

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దళిత బాలికలపై యాసిడ్ దాడి జరిగింది. ముగ్గురు అక్కాచెళ్లెల్లు గోండా జిల్లాలోని తమ నివాసంలో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితులను హాస్పిటల్ తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్నారు. 17 ఏళ్ల పెద్దమ్మాయికి ఎక్కువగా గాయాలయ్యాయని, గుర్తు తెలియని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. కుటుంబీకులు ఇప్పటి వరకు ఎవరిపైనా అనుమానమున్నట్లు వివరించలేదని, అయినప్పటికీ తాము దోషులను […]

Update: 2020-10-13 05:56 GMT

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దళిత బాలికలపై యాసిడ్ దాడి జరిగింది. ముగ్గురు అక్కాచెళ్లెల్లు గోండా జిల్లాలోని తమ నివాసంలో నిద్రిస్తున్న సమయంలో కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితులను హాస్పిటల్ తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్నారు.

17 ఏళ్ల పెద్దమ్మాయికి ఎక్కువగా గాయాలయ్యాయని, గుర్తు తెలియని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. కుటుంబీకులు ఇప్పటి వరకు ఎవరిపైనా అనుమానమున్నట్లు వివరించలేదని, అయినప్పటికీ తాము దోషులను వెతికిపట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలికి వెళ్లాయని తెలిపారు. ఇటీవలే బాధిత పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు.

Tags:    

Similar News