ఇక ఆ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కనిపించవ్

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పరిధిలో 65వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు ఇక కనిపించవు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లను తొలగించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. పట్టణంలో డివైడర్ నిర్మించే క్రమంలో రహదారి ఇరుకుగా మారనున్నడంతో భారీ వృక్షాలను తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో భారీ చెట్లను తొలగించడం పట్ల పట్టణవాసులు ఆవేదన వ్యక్తం […]

Update: 2020-04-29 02:03 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పరిధిలో 65వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు ఇక కనిపించవు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లను తొలగించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. పట్టణంలో డివైడర్ నిర్మించే క్రమంలో రహదారి ఇరుకుగా మారనున్నడంతో భారీ వృక్షాలను తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుతూనే.. మరోవైపు అభివృద్ధి పేరుతో భారీ చెట్లను తొలగించడం పట్ల పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా రంజోల్, అల్లీపూర్, పస్తాపూర్, జహీరాబాద్ శివారుల మీదుగా కొనసాగుతున్న డివైడర్ పనుల కారణంగా 65వ నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను బీదర్ చౌరస్తా వరకు తొలగించే అవకాశాలు ఉన్నాయని అటవీశాఖ అధికారి ఒక్కరు వెల్లడించారు.

tag: NH 65, zahirabad, trees, road extension works, medak

Tags:    

Similar News