చనిపోయి అంతక్రియలు ముగిసాక.. కరోనా పాజిటివ్

దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొంత మందికి కరోనా ఉన్న లక్షణాలు త్వరగా బయటపడటం లేదు. ఈ నేపథ్యంలో ఒ వ్యక్తి చనిపోయి అంతక్రియలు ముగిసాక తనకు కరోనా పాజిటివ్ అని తేలింది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి అస్వస్థకు గురయ్యాడు. అక్కడి ప్రాథమిక ఆసుపత్రిలో కరోనా పరిక్షలు చేయించుకోగా అతనికి […]

Update: 2021-04-14 22:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కొంత మందికి కరోనా ఉన్న లక్షణాలు త్వరగా బయటపడటం లేదు. ఈ నేపథ్యంలో ఒ వ్యక్తి చనిపోయి అంతక్రియలు ముగిసాక తనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి అస్వస్థకు గురయ్యాడు. అక్కడి ప్రాథమిక ఆసుపత్రిలో కరోనా పరిక్షలు చేయించుకోగా అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. అయతే మరోసారి కరోనా టేస్ట్ చేయుచుకోవాలనే వైద్యుల సలహా మేరకు తాను ఈనెల 12న మరోసారి ఏనుగల్‌ గ్రామంలో 104 అంబులెన్స్‌ ద్వారా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. దీని ఫలితం రాకముందే

మంగళవారం రాత్రి అతను మృతి చెందాడు. దీంతో అతనికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఆశ వర్కర్ కు అతనికి పాజిటివ్ వచ్చిందని మెసేజ్ వచ్చింది. అప్పటికే అతనికి అంత్యక్రియలు జరిగాయి. దీంతో అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యలు , బంధువులు , గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో 20కి పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News