నేడు ఈటల ప్రమాణ స్వీకారం

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత నెల 30న ఉప ఎన్నిక జరగ్గా.. ఈ నెల 2వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వారం రోజుల తర్వాత ఆయన స్పీకర్ ఛాంబర్‌లో ఉదయం 11.30 గంటలకు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో తన ముఖం చూడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన సంగతి […]

Update: 2021-11-09 18:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత నెల 30న ఉప ఎన్నిక జరగ్గా.. ఈ నెల 2వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. వారం రోజుల తర్వాత ఆయన స్పీకర్ ఛాంబర్‌లో ఉదయం 11.30 గంటలకు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో తన ముఖం చూడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇంతకాలం మంత్రిగా అధికార పక్షంలో ముందు వరుసలో కూర్చున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా విపక్ష సభ్యులకు కేటాయించే ఎడమవైపున (స్పీకర్‌కు) కూర్చోనున్నారు. మంత్రిగా ఇంతకాలం ప్రభుత్వ విధానాలను సమర్ధించుకుని విపక్ష సభ్యుల నోరు మూయించిన ఈటల.. ఇకపైన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రతిపక్ష సభ్యుడి పాత్రను పోషించనున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను మాత్రమే కాక ప్రభుత్వ తప్పులను కూడా సభాముఖంగా విమర్శించనున్నారు.

Tags:    

Similar News