కరోనాతో ఎల్లమ్మ దేవాలయ అర్చకుడు మృతి

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా వైరస్ సోకి ఓ అర్చకుడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కిలా గణపురం మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన లట్టుపల్లి విష్ణుశర్మ(41) గత కొన్నేండ్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని భార్య కరోనా బారిన పడడంతో విష్ణు శర్మ సైతం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు. […]

Update: 2021-05-07 02:19 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనా వైరస్ సోకి ఓ అర్చకుడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కిలా గణపురం మండలం మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన లట్టుపల్లి విష్ణుశర్మ(41) గత కొన్నేండ్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని భార్య కరోనా బారిన పడడంతో విష్ణు శర్మ సైతం హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు. దీంతో విష్ణు శర్మ అస్వస్థతకు గురికావడంతో నాలుగు రోజుల క్రితం భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా పాజిటివ్ ఉండడంతో అతనికి ఆసుపత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి విష్ణుశర్మ తుదిశ్వాస విడిచారు. విష్ణుశర్మ మరణించాడని తెలియగానే ఆయా ఆలయాల అర్చకులు, భక్తులు దిగ్భ్రాంతి చెందారు.

Tags:    

Similar News