ఆ విషయంలో ఏపీ గ్రేట్.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

దిశ, ఏపీ బ్యూరో : న్యాయవ్యవస్థ రంగంలో మహిళల ప్రాధాన్యత అంశంపై లోక్‌సభలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలోని సిట్టింగ్ జడ్జీలలో మహిళా న్యాయమూర్తులు కేవలం 12% మాత్రమే ఉన్నారు (677 మందిలో 81 మంది). దిగువ కోర్టులలో 27శాతం మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారతకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. […]

Update: 2021-12-08 06:34 GMT

దిశ, ఏపీ బ్యూరో : న్యాయవ్యవస్థ రంగంలో మహిళల ప్రాధాన్యత అంశంపై లోక్‌సభలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలోని సిట్టింగ్ జడ్జీలలో మహిళా న్యాయమూర్తులు కేవలం 12% మాత్రమే ఉన్నారు (677 మందిలో 81 మంది). దిగువ కోర్టులలో 27శాతం మంది ఉన్నారు.

ఏపీ ప్రభుత్వం మహిళల సాధికారతకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. అందులో భాగంగానే అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌తో సహా ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తోంది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ ద్వారా మహిళల ప్రాతినిధ్యం, పౌరులందరికీ న్యాయం పొందే హక్కును రక్షించే సంస్థ అంతర్గతంగా కూడా న్యాయమైనదని నిర్ధారిస్తుంది. అందుకోసం ప్రభుత్వం అవసరమైన చట్టాన్ని తీసుకురావాలని ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు.

Tags:    

Similar News