కనికరంలేని తల్లి.. చెట్లపొదల్లో చిన్నారి

దిశ, ముథోల్ : ఏ తల్లి కన్న బిడ్డనో తెలియదు కానీ అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు చెట్లపొదల్లో దర్శనమిచ్చింది. ఆడపిల్ల భారం అనుకుందో మరేదైన కారణం ఉందో కానీ.. అప్పుడే పుట్టిన చిన్నారిని చెట్ల పొదల్లో పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళకు చిన్న పిల్ల ఏడుపు వినపపడడంతో దగ్గరకి వెళ్లింది. […]

Update: 2021-04-17 22:47 GMT

దిశ, ముథోల్ : ఏ తల్లి కన్న బిడ్డనో తెలియదు కానీ అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు చెట్లపొదల్లో దర్శనమిచ్చింది. ఆడపిల్ల భారం అనుకుందో మరేదైన కారణం ఉందో కానీ.. అప్పుడే పుట్టిన చిన్నారిని చెట్ల పొదల్లో పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళకు చిన్న పిల్ల ఏడుపు వినపపడడంతో దగ్గరకి వెళ్లింది. మహిళ అక్కడ చూసేసరికి ఓ ఆడ పసికందు చెట్లపొదల్లో పడి ఉంది. దీంతో వెంటనే ఆ మహిళ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Tags:    

Similar News