బయటపడుతున్న గంగను మింగిన ఘనులు

దిశ, ఆదిలాబాద్: గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో వందలాది ఎకరాలు ఆక్రమణ వ్యవహారంలో గంగను మింగిన ఘనులు బయట పడుతూనే ఉన్నారు. బుధవారం ఒక్కరోజే 1200 ఎకరాలకు పైగా కబ్జా జరిగినట్లు గుర్తించిన అధికారులు.. గురువారం మరో రెండు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ముధోల్ మండలం సాలాపూర్ పూర్ సావర్గాం గ్రామాల్లో సర్వే నిర్వహించగా సుమారు 450 ఎకరాలు పరాధీనం పాలైనట్లు అధికారులు గుర్తించారు. సాలాపూర్ గ్రామంలో 248 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు […]

Update: 2020-05-28 07:57 GMT

దిశ, ఆదిలాబాద్: గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో వందలాది ఎకరాలు ఆక్రమణ వ్యవహారంలో గంగను మింగిన ఘనులు బయట పడుతూనే ఉన్నారు. బుధవారం ఒక్కరోజే 1200 ఎకరాలకు పైగా కబ్జా జరిగినట్లు గుర్తించిన అధికారులు.. గురువారం మరో రెండు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ముధోల్ మండలం సాలాపూర్ పూర్ సావర్గాం గ్రామాల్లో సర్వే నిర్వహించగా సుమారు 450 ఎకరాలు పరాధీనం పాలైనట్లు అధికారులు గుర్తించారు. సాలాపూర్ గ్రామంలో 248 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించిన ల్యాండ్ సర్వే అధికారులు… సావర్గాం గ్రామంలో 199 ఎకరాలు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ భూములు పరుల చేతుల్లో ఉన్నట్లు తేల్చారు. తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తుండటంతో అధికారులు సైతం విస్తుపోతున్నారు.

Tags:    

Similar News