బ్రెజిల్‌తో తలపడనున్న భారత ఫుట్‌బాల్ జట్టు

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు తొలిసారిగా బ్రెజిల్‌లోని మనౌస్‌లో బ్రెజిల్, చిలీ, వెనిజులాతో తలపడుతోందని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే, భారత జట్టు నవంబర్ 25న బ్రెజిల్‌తో, నవంబర్ 28న చిలీతో, డిసెంబర్ 1న వెనిజులాతో మ్యాచ్‌లు ఆడనుంది. ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 57వ స్థానంలో ఉండగా, బ్రెజిల్ 7వ స్థానం, చిలీ 37వ స్థానం, వెనిజులా 56వ స్థానంలో కొనసాగుతున్నాయి. బ్రెజిల్, చిలీ సాధారణ ప్రపంచకప్ […]

Update: 2021-11-09 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు తొలిసారిగా బ్రెజిల్‌లోని మనౌస్‌లో బ్రెజిల్, చిలీ, వెనిజులాతో తలపడుతోందని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే, భారత జట్టు నవంబర్ 25న బ్రెజిల్‌తో, నవంబర్ 28న చిలీతో, డిసెంబర్ 1న వెనిజులాతో మ్యాచ్‌లు ఆడనుంది. ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 57వ స్థానంలో ఉండగా, బ్రెజిల్ 7వ స్థానం, చిలీ 37వ స్థానం, వెనిజులా 56వ స్థానంలో కొనసాగుతున్నాయి. బ్రెజిల్, చిలీ సాధారణ ప్రపంచకప్ జట్లే అయినప్పటికీ ఆ జట్లతో ఆడటం మా మహిళల జట్టు స్థాయిని పెంచడంలో సహాయపడుతుందని AIFF జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్ అన్నారు.

Tags:    

Similar News