ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం

కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అత్యవసరముంటే తప్ప కార్యాలయాలకు ఉద్యోగులు రాకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒకవేళ అత్యవసర సమయంలో కార్యాలయానికి వచ్చినా.. వారు గేటు వద్దనే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతే లోనికి అనుమతి కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పనులు ఉంటే ఆయా ఉద్యోగులు రిపోర్టులను గేటు వద్దనే సమర్పించాలంది. దీంతో సెక్రటేరియట్‌తో సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో రేపటి నుంచి […]

Update: 2020-03-18 09:05 GMT

కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అత్యవసరముంటే తప్ప కార్యాలయాలకు ఉద్యోగులు రాకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ఒకవేళ అత్యవసర సమయంలో కార్యాలయానికి వచ్చినా.. వారు గేటు వద్దనే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతే లోనికి అనుమతి కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పనులు ఉంటే ఆయా ఉద్యోగులు రిపోర్టులను గేటు వద్దనే సమర్పించాలంది. దీంతో సెక్రటేరియట్‌తో సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో రేపటి నుంచి ఈ విధానం అమలు చేసేందుకు తగు ఏర్పాట్లు చేసింది. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలు తగు జాగ్రత్తలు వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

tag: corona effect, Government Offices, telangana

Tags:    

Similar News