కృష్ణా నదిలో మునిగి కాడెద్దులు మృతి..

దిశ, వీపనగండ్ల: నీట మునిగి రెండు కాడెద్దులు మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెల్లె పాడు గ్రామానికి చెందిన అంబన్న అనే రైతు తన రెండు ఎద్దులను బండికి కట్టుకొని కృష్ణా నది పుష్కర ఘాట్ దగ్గరకు వెళ్ళాడు. బండిని కడగడానికి నదిలోకి తీసుకెళ్లిన సమయంలో రెండు ఎద్దులు నదిలో మునిగి మృతి చెందాయి. సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ […]

Update: 2021-12-14 07:08 GMT

దిశ, వీపనగండ్ల: నీట మునిగి రెండు కాడెద్దులు మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెల్లె పాడు గ్రామానికి చెందిన అంబన్న అనే రైతు తన రెండు ఎద్దులను బండికి కట్టుకొని కృష్ణా నది పుష్కర ఘాట్ దగ్గరకు వెళ్ళాడు. బండిని కడగడానికి నదిలోకి తీసుకెళ్లిన సమయంలో రెండు ఎద్దులు నదిలో మునిగి మృతి చెందాయి. సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్, మాజీ సర్పంచ్ బిచుపల్లి సంఘటనా స్థలానికి చేరుకుని రైతును ఓదార్చారు. అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత రైతుకు ధైర్యం చెప్పారు.

Tags:    

Similar News