హైదరాబాద్‌ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములు సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13గుంటల భూమిలో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. 1951 నుంచి ఆ భూములు దేవాదాయశాఖ ఆధినంలో ఉన్నాయని వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే ఈ భూములను తనకు ఆలయ ట్రస్ట్ అమ్మిందంటూ ఆ వ్యక్తి పోలీసుల సాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. […]

Update: 2020-12-16 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములు సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13గుంటల భూమిలో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. 1951 నుంచి ఆ భూములు దేవాదాయశాఖ ఆధినంలో ఉన్నాయని వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే ఈ భూములను తనకు ఆలయ ట్రస్ట్ అమ్మిందంటూ ఆ వ్యక్తి పోలీసుల సాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ స్థానికులు భూముల్లోకి వెళ్లి బైఠాయించడంతో వారికి మద్దతు తెలిపేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లారు. పోలీసులు భారీగా మోహరించి స్థానికులను చెదరగొడుతున్నారు.

Full View

Tags:    

Similar News