దర్శనాలకు క్యూ కట్టిన భక్తులు

దిశ, కరీంనగర్: ఆదివారం వరకు నిత్య కైంకర్యాలకే పరిమిమైన ఆలయాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూ ఆలయాల్లో భక్తలను అనుమతించవచ్చనే సడలింపులివ్వడంతో నేడు ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు ఆలయాలకు వెళ్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయాల్లో భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఆలయంలో థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేయడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ బాక్సులు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించే […]

Update: 2020-06-07 22:30 GMT

దిశ, కరీంనగర్: ఆదివారం వరకు నిత్య కైంకర్యాలకే పరిమిమైన ఆలయాలు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూ ఆలయాల్లో భక్తలను అనుమతించవచ్చనే సడలింపులివ్వడంతో నేడు ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు ఆలయాలకు వెళ్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయాల్లో భక్తులు దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఆలయంలో థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేయడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ బాక్సులు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించే ముందే కాళ్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకంగా నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. మాస్కులు లేకుండా ఆలయంలోకి అనుమతించడం లేదని దేవాదాయ అధికారులు తెలిపారు. ఆలయంలో కుంకుమ కూడా అందుబాటులో ఉంచవద్దని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కేవలం స్వామి వారిని లఘు దర్శనం ద్వారా మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుందని, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం లేదని వారు వివరించారు.

Tags:    

Similar News