ప్రభుత్వ చర్యలతోనే మరోసారి అధికారంలోకి: కేంద్ర మంత్రి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంపై కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా..telugu latest news

Update: 2022-03-14 13:05 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంపై కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే తిరిగి అధికారంలోకి వచ్చిందని అన్నారు. 'ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. యూపీలో శాంతిభద్రతలు లేకుంటే మెజారిటీ వచ్చేది కాదు' అని అన్నారు. కాగా, ఆయన కుమారుడు అశిశ్ మిశ్రా లఖింపూర్ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అశిశ్ మిశ్రా బెయిల్ పై విడుదలయ్యారు.

Tags:    

Similar News